కందుకూరు మండలం పలకలూరు గ్రామంలో పండ్లు, కూరగాయలతో విలువ ఆధారిత పదార్థాలపై కేవికే విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ నిహారిక ఆధ్వర్యంలో గురువారం మహిళలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. వివిధ రకాల పండ్లతో బెల్లం, చక్కెరతో పని లేకుండా తయారు చేయడం పై అవగాహన కల్పించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. మహిళలు స్వసక్తితో పైకి రావడానికి తోడ్పాటు అందిస్తుందన్నారు.