అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

72చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్  పట్టివేత
కందుకూరు మండలం పాలూరు గ్రామంలో ఉన్న మన్నేరు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. మున్నేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో.. కందుకూరు రూరల్ ఎస్సై మహేంద్ర నాయక్ తన సిబ్బందితో కలిసి గురువారం దాడి చేసి పట్టుకున్నాడు. ట్రాక్టర్ ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ పై కేసులను నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్