ఉలవపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో నేడు ఉదయం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగునుంది. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక టిడిపి నాయకులు తెలిపారు. టిడిపి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.