చిట్ట చివరి ఎకరాకు కూడా సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం సంగం హెడ్ రెగ్యులేటరీ నుండి కావలి కాలువకు రైతులతో కలిసి ఆనందడోలికల్లో సందడి వాతావరణంలో నీటిని విడుదల చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కళ్ళలో ఆనందం నింపటానికి 135 నుండి 150 రోజుల వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.