శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, కావలి ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి ని పొగడ్తలతో ముంచేత్తారు. కావలిలోని సెల్ఫీ పాయింట్లు అద్భుతంగా రూపొందించాలని, పార్టీల కతీతంగా ప్రముఖుల చిత్రపటాలను ఎక్కడ ప్రతిష్టించాలని ఈ సందర్భంగా రవి నాయుడు అన్నారు. ఎమ్మెల్యే పిలుపుమేరకు కావలి వచ్చి మినీ స్టేడియాన్ని పరిశీలించడం జరిగిందని, త్వరలోనే మినీ స్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.