నెల్లూరు జిల్లా కావలిలో తుఫాన్ ప్రభావం భారీ స్థాయిలో కనిపిస్తుంది. రోడ్లపై మూడు అడుగుల లోతులో నీరు ప్రవహిస్తుండడం అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. మరోవైపు విద్యుత్ కోత ప్రజలను వెంటాడుతుంది. మరో రెండు రోజులు భారీ స్థాయిలో తుఫాన్ ప్రభావం ఉండడంతో ఏ నిమిషం ఏ ముప్పు వస్తుందో అని కావలి ప్రజలు ఆవేదన చెందుతున్నారు.