విద్యుత్ తీగలను సరి చేస్తుండగా కరెంట్ షాకు తగిలి ఓ యువకుడు గాయాలపాలైన ఘటన కావలి పట్టణ శివారు బుడంగుంటలో సోమవారం జరిగింది. కరెంట్ వైర్లను సరిచేస్తుండగా శెట్టిపల్లి తిరుమల్ అనే యువకుడికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు యువకుడ్ని చికిత్స నిమిత్తం కావలి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.