కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం కోవూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని గుమ్మలదిబ్బ నందు ఉదయం ఏడు గంటల ముఫ్పై నిమిషాలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొంటారని నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.