కృష్ణా నదికి, బుడమేరు కాలువకు తేడా కూడా తెలియని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని
నెల్లూరులో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ బుడమేరు వాగులో వైసీపీ నేతలు వెల్లంపల్లి, అవినాష్ ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరిపి. లేవుట్స్ వేశారన్నారు. గత ప్రభుత్వా నిర్లక్ష్యం వల్లే వరద వచ్చిందన్నారు.