నెల్లూరులో సిపిఎం ఆధ్వర్యంలో సామూహిక నిరసన ధర్నా

74చూసినవారు
రిజిస్ట్రేషన్ పట్టాల సాధన కోసం నెల్లూరు సిటీ వెంకటేశ్వరపురం సెంటర్ లో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రజలతో సామూహిక నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ 53, 54 డివిజన్ల పరిధిలోని ఇళ్లకు స్థలాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగిన పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్