ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారము మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైతే వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం ఆయన నెల్లూరు ముత్తుకూరు బస్టాండ్ సెంటర్లో జరిగిన ప్రజాపోరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ట్రూ అప్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని, విద్యుత్ చార్జీలు పెంచవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.