ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మంగళవారం బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. చీఫ్ విప్, విప్‌లను మంగళవారం ఖరారు చేస్తామని సీఎం చెప్పినట్లు తెలిపారు.