నెల్లూరు జిల్లా ఎయిర్పోర్ట్ విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి(VSR) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు దగాకోరు హామీల్లో నెల్లూరు ఎయిర్ పోర్టు ఒకటి. 2018లో దగదర్తి వద్ద ఎయిర్పోర్టు పనులు ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేస్తామని నమ్మబలికారు. నేను ప్రామిస్ చేస్తున్నా. జగన్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎయిర్పోర్టు పనులు మొదలుపెట్టి 30 నెలల్లో పూర్తి చేస్తాం' అని ఆయన ట్వీట్ చేశారు.