నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ ఓ. ఆనంద్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి శనివారం మర్యాదపూర్వకంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. గతంలో గూడూరు సబ్ కలెక్టర్ గా పని చేసిన అనుభవాలను నెల్లూరు కలెక్టర్ ఎమ్మెల్సీతో చర్చించారు.