ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దీనిని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని జిల్లా బిజెపి అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరు నగరంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.