విచారణ మాత్రమేనా చర్యలు చేపట్టరా ?

52చూసినవారు
విచారణ మాత్రమేనా చర్యలు చేపట్టరా ?
దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్న షేక్ మహమ్మద్ రఫీ మీద ఐదేళ్ళుగా అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మే నెల 27వ తేదీన ప్రచురించిన కథనం వైరల్ అవడంతో అధికారులు విచారణ పేరుతో ఏరుకొల్లు గ్రామానికి వచ్చారని ఐదేళ్ళుగా విచారణ మాత్రమే జరుగుతుందని చర్యలు లేవని గ్రామస్తులు వాపోయారు. అధికారి పెడుతున్న ఇబ్బందుల వలన అర్హత ఉన్నా పథకాలకు, పెన్షన్లకు నోచుకోక ఐదేళ్ళుగా మానసికంగా కృంగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారి అవినీతి కార్యకలాపాల మీద సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్