ఉదయగిరి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది సంజీవనిగా పేరుగాంచిన ఉదయగిరి కొండ, శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి కోటలు, ఆలయాలు. గత రెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉదయగిరి కొండ కొత్త రూపును సంతరించుకుంది. ఉదయగిరి కొండను డ్రోన్ విజువల్స్ తో వీడియో తీయగా చూడముచ్చటగా ఉంది. కొండ దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, కొండపై చెట్లు వాతావరణానికి అనుకూలంగా ఎంతో అందంగా ఉన్నాయి.