తిరుమల లడ్డు పవిత్రతపై వస్తున్న వార్తలు హిందూ సోదరులను ఆవేదనకు గురిచేస్తున్నాయని బిజెపి నాయకులు మహేంద్రబాబు మోడీ అన్నారు. ఏరుకొల్లులోని వారి స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. భారతదేశంలో సనాతన సాంప్రదాయాలకు ప్రాముఖ్యత అధికమన్నారు. కోట్లాది భక్తులు ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వరస్వామి ప్రసాదాలపై వస్తున్న వార్తలు బాధాకరమన్నారు. నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలను నిగ్గుతేల్చాలని కోరారు.