దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు సచివాలయంలో అనేక అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మురిగెమ్మి రత్తయ్య తనవద్ద పెన్షన్ ఇప్పిస్తానంటూ వెల్ఫేర్ అధికారి షేక్ మహమ్మద్ రఫీ 5వేల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపించారు. పెన్షన్ రాలేదని అధికారిని సంప్రదిస్తే వయస్సు రీత్యా రాదని చెప్పారన్నారు. చదువులేని నాకు అర్హతకు సంబంధించిన అవగాహన ఎలా ఉంటుందని, అధికారి మాలాంటి పేదలను మోసం చేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.