ఉదయగిరి లో డయాలిస్ సెంటర్ ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఉదయగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీరు వల్ల డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రికి తెలపడంతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారని, అలాగే ఉదయగిరిలో మరొక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో కోరారు. అలాగే వంద పడకల ఆసుపత్రి గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడారు.