వరికుంటపాడు: భూముల రీసర్వే పై గ్రామసభ

51చూసినవారు
వరికుంటపాడు: భూముల రీసర్వే పై గ్రామసభ
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని కాంచెరువు గ్రామంలో భూముల రీసర్వే పై శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ చెంచయ్య మాట్లాడుతూ గతంలో జరిగిన భూముల రీ సర్వేలో ఏవైనా సమస్యలు ఉంటే గ్రామ సభలో తెలియజేయాలన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే ఈ రీసర్వే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు భూ సమస్యలుంటే తమకు తెలియజేసి పరిష్కరించుకోవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్