అనంతపురం జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా బాణాసంచాను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జగదీశ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. బాణాసంచా విక్రయ దారులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. అనుమతి ఉంటేనే నిబంధనలు పాటిస్తూ విక్రయించాలని చెప్పారు.