అనంతపురానికి చెందిన హరి(21) మంగళవారం అన్నమయ్య జిల్లాలో మృతిచెందాడు. కురబలకోట మండలం అంగళ్లుకు స్నేహితురాలిని కలవడానికి వెళ్లాడు. బస్టాండు వద్ద నిలబడి మాట్లాడుతుండగా ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చాయి. కిందపడి గాయపడడంతో వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మార్గమధ్యలోనే హరి మృతిచెందినట్లు నిర్ధారించారు.