ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ మొదలైంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాలతో అనంతపురంలోని ఒకటో డివిజన్ ఎర్రనేల కొట్టాల్ ఎం. జి. కాలనీ నందు గురువారం ఉదయం 6 గంటలకే 4 వేల రూపాయల పెన్షన్ అవ్వ తాతలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ నూర్, రఫీ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.