ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తనదైన శైలిలో పంచులు వేశారు. సోమవారం ధర్మవరంలో మంత్రి మాట్లాడుతూ ధర్మవరంకి తాను వచ్చిన కొత్తలో ఎక్కడ చూసినా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు వినిపించేదని తర్వాత చిలక మధుసూదన్ రెడ్డిని అడగ్గా గుడ్ మార్నింగ్ పేరుతో ప్రజలు నిద్రలో ఉన్నప్పుడు బయటికి వెళ్లి ఖాళీ స్థలాలను గుటకాయ స్వాహా చేశాడని పరోక్షంగా విమర్శించారు.