గోట్లురు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ఈ నెల 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఐఎఫ్బీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణు నారాయణ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కిమ్స్ సవేరా ఆస్పత్రి-అనంతపురం వారి సహాయ సహకారంతో గుండెనొప్పి, చాతినొప్పి, గుండె దడ, ఆయాసం, కళ్లు తిరగడం వంటి వ్యాధులకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.