ధర్మవరం పట్టణంలోని శివానగర్లో గల బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశ భక్తిని చాటే పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ సి. విశేషు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరిలో దేశభక్తి కలిగినప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుందన్నారు.