ధర్మవరంలో భారతీయ సైనిక 77వ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్వాతి క్లినిక్లో యువర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు వీ. మోహన్, ఆర్. శ్రీధర్ శాలువాతో సత్కరించారు. వారు మాట్లాడుతూ. భారత దేశంలో భారతదేశాన్ని మాతృభూమిగా తలచి, భారతదేశ ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మంచు కొండల్లో, మహాసముద్రంలో, అనంత నీలి గగనంలో దేశ రక్షణ బాధ్యతలను నేడు జవాన్లు నెరవేరుస్తారని తెలిపారు.