ధర్మవరం పట్టణంలో డ్రైనేజ్ నీరు 8వ వార్డులోని ప్రధాన ఇరిగేషన్ కాలువలతో కలుస్తోంది. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు కారణంగా కాలువలు మూసుకుపోయాయి. ఈ సమస్యపై ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కి సమాచారాన్ని అందించగా ఆయన ఆదేశాల మేరకు తెదేపా పట్టణ అధ్యక్షులు పరుసే సుధాకర్, 8వ వార్డు తెదేపా నాయకులు పూల నరేష్, బట్ట ధనంజయ్, జల్లా మణికుమార్, ఇతర వార్డు కార్యకర్తలు ఆదివారం పరిస్థితిని పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.