ధర్మవరం పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, ఎల్ పి సర్కిల్ వద్ద నూతన అన్న క్యాంటీన్ ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ గురువారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం అన్న క్యాంటీను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రాత్రి వేళలో నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిలకం మధుసూదన్ రెడ్డి, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.