విద్యుత్ షాక్ తో ఇద్దరు మహిళలకు గాయాలు

59చూసినవారు
విద్యుత్ షాక్ తో ఇద్దరు మహిళలకు గాయాలు
ముదిగుబ్బ మండలంలో పంచాయత్ ఆఫీస్ ఎదుట జామకాయలు అమ్ముకుంటున్న ఇద్దరు మహిళలు ఆదివారం కరెంట్ షాక్ తో గాయపడ్డారు. ఆకస్మికంగా మెయిన్ లైన్ వేర్లు తెగిపడి మహిళలపై పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ మరియు టీడీపీ నాయకుడు చరణ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసి గాయపడిన మహిళలను హాస్పిటల్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్లు ప్రాణాపాయం లేదని, హాస్పిటల్ సిబ్బంది తెలియజేశారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఒక మహిళను అనంతపురం తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్