రామగిరి అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ సిడిపిఓ

69చూసినవారు
రామగిరి అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ సిడిపిఓ
పామిడి మండల పరిధిలోని రామగిరి, ఎగువ తాండ అంగన్వాడి కేంద్రాలను శనివారం అడిషనల్ సిడిపిఓ నాగమణి ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం గర్భవతులకు అందవలసిన పౌష్టికాహారం గురించి ఆరా తీశారు. విద్యార్థులకు రైమ్స్ ద్వారా పాఠాలు బోధించాలన్నారు.

సంబంధిత పోస్ట్