శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురం గ్రామానికి చెందిన బాలుడు ప్రవీణ్ గురువారం ఉదయం దంతాలు తోముకుంటుండగా ప్రమాదపు శాత్తు కిందపడి దవడలోకి టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. ఈ విషయం గమనించిన తల్లిదండ్రులు కదిరి ప్రభుత్వం ఆసుపత్రికి బాలుడిని తీసుకెళ్లారు. డాక్టర్లు 40 నిమిషాల పాటు శాస్త్ర చికిత్స చేసి బ్రష్ ను తొలగించారు.