హాస్టల్ ను తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ

72చూసినవారు
హాస్టల్ ను తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ
విజయవాడలోని ఎలక్ట్రిక్ సిటీ కాలనీ నందు ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహములను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. హాస్టల్ లో అందిస్తున్న భోజనం, మౌలిక సదుపాయాలు గురించి మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను, భోజనశాల, వంట గదులను, పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్