చైనాలోని 'యాగి' తుఫాన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైనన్, గాంగ్డింగ్ నగరాలను 'యాగి' తుఫాన్ వణికిస్తోంది. గంటకు 234 కి.మీ భారీ వేగంతో గాలులు వీస్తుండటంతో రోడ్లపై వెళ్తున్న మనుషుల సైతం కొట్టుకుపోతున్నారు. అయితే ఓ యువకుడు గాలులు వల్ల స్కూటీతో పాటు కొట్టుకుపోయాడు. ఈ తుఫాన్ వల్ల 8 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాఠశాలలు, కాలేజీలు, విమానాలను రద్దు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.