పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో శనివారం జాతీయ న్యాయ సేవ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పెనుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వాసుదేవన్, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ముజీబ్ పసఫల సయ్యద్ హాజరయ్యారు. వాసుదేవన్ మాట్లాడుతూ.. ప్రతి పేదవానికి న్యాయం అందేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన ఉండాలని అది జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.