తెల్లవారుజామున జరిగిన రైడ్‌లో, సోమందేపల్లి మండల హెడ్ క్వార్టర్‌లోని శివాలయం వద్ద జూదం ఆడుతున్న పదిమందిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో 16,800 రూపాయల డబ్బు మరియు 2 పేక కట్టలు సీజ్ చేయబడినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపనున్నట్టు పేర్కొన్నారు.