రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నిలిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ ఇందిరా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కొత్తచెరువులో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను సీఐ ఇందిరా పరిష్కరించారు. అలాగే పోలీసు సిబ్బందితో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారిలో ఆమె పెట్రోలింగ్ నిర్వహించారు. రోడ్లపై బడ్డీ కోట్లు ఉంచరాదని వ్యాపారులను హెచ్చరించారు. నిర్లక్ష్యంగా రోడ్లపై నిలిపి ఉన్న వాహనదారులకు, యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.