పుట్టపర్తి లోని చిన్నపల్లి హైస్కూల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ చేతన్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరై పిల్లలకు డివార్మింగ్ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటిస్తే భోజనం తర్వాత వీటిని తప్పక వేసుకోవాలని సూచించారు.