పుట్టపర్తి: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత డీఎస్సీ శిక్షణ కొరకు దరఖాస్తులు

60చూసినవారు
పుట్టపర్తి: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత డీఎస్సీ శిక్షణ కొరకు దరఖాస్తులు
శ్రీసత్యసాయి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత డీఎస్సీ శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదివారం జిల్లా ఎస్సీ, సంక్షేమ సాధికార అధికారి శివ రంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. భోజనం, వసతి సౌకర్యాలతో మూడు నెలలు శిక్షణ ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా ఈనెల 21వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్