తన భర్తను గుర్తు చేసుకొని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం పరిటాల రవిపై పాట పాడారు. 'ఎక్కడికి వెళ్లిండే పరిటాల రవన్న. పెనుకొండ పులి బిడ్డ అనంతపురం వచ్చేనమ్మ' అంటూ పాడారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న పరిటాల అభిమానులు జోహార్ పరిటాల రవన్న అంటూ నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.