రాయదుర్గం: కనేకల్ మండలంలోని హనకనహల్ గ్రామంలో సీజనల్ వ్యాధుల అప్రమత్తతపై మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్ విస్తృత అవగాహన కల్పించారు. శుక్రవారం స్థానిక ఏఎన్ఎం లతో కలిసి ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరిసరాలు చుట్టుపక్కల నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. నీటి నిల్వలో దోమలు గుడ్లు పెట్టి దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు.