రాయదుర్గం పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. కొండ ప్రాంతాన్ని మంగళవారంవా ఉదయం పొగ మంచు కమ్మేసింది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఊటిని తలపించేలా కొండ ప్రాంతం ఉండటంతో స్థానిక ప్రజలు ఆ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు బయటకు కూడా రాలేకపోయారు. గ్రామాలలో ఇంటిముందు భోగి మంటలు వేసుకుని చలి కాపుకున్నారు.