పుట్లూరు మండలంలో ప్రజా పోరుయాత్ర కార్యక్రమాన్ని సీపీఎం నాయకులు శనివారం చేపట్టారు. మండల పరిధిలోని కడవకల్లులో నాయకులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. మండల కార్యదర్శి సూరి మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. 14న పుట్లూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు.