పెద్దవడుగూరు: బైక్ అదుపుతప్పి బోల్తా ఇద్దరికీ తీవ్రగాయాలు

81చూసినవారు
పెద్దవడుగూరు: బైక్ అదుపుతప్పి బోల్తా ఇద్దరికీ తీవ్రగాయాలు
పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల గ్రామ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలుకు చెందిన దాదా కలందర్, ఫాతిమా దంపతులు బైక్ లో క్రిష్టిపాడుకు బయలుదేరారు. మార్గ మధ్యలో అప్పేచెర్ల సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో దంపతులు దాదా కలందర్, ఫాతిమా తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ లో గుత్తికి తరలించారు. అనంతరం వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు.

సంబంధిత పోస్ట్