అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను పెద్దపప్పూరు పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్సై నాగేంద్రప్రసాద్ తన సిబ్బందితో ముచ్చుకోట వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.