అక్రమంగా విక్రయిస్తున్న టపాసులను అర్బన్ పోలీసులు సీజ్ చేశారు. తాడిపత్రి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ లో కిరాణా దుకాణంలో రంగస్వామి అనే వ్యక్తి టపాసులను నిల్వ ఉంచుకుని అక్రమంగా విక్రయిస్తున్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే సీఐ సాయిప్రసాద్ తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ. 2 వేలు విలువ చేసే టపాసులను స్వాదీనం చేసుకుని రంగస్వామిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.