పెద్దవడుగూరు: గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సై

59చూసినవారు
పెద్దవడుగూరు: గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సై
పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల గ్రామంలో శనివారం ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం గ్రామసభలో ఎస్సై మాట్లాడుతూ గ్రామస్తులందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించాలన్నారు. అల్లర్లకు, గొడవలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్