తాడిపత్రి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే బనానా రైలును శుక్రవారం అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మినారాయణ, కలెక్టర్ వినోద్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. తాడిపత్రి ప్రాంతంలోని పుట్లూరు, నార్పల, పప్పురు, యాడికి మండలాల్లో నాణ్యమైన అరటి లభించడంతో ఇక్కడకు వచ్చి అరటిని గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమన్నారు.