తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. వైస్ ఛైర్మన్ అబ్ధుల్ రహీం సమావేశానికి అధ్యక్షత వహించారు. పట్టణ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై కౌన్సిల్ సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు. కౌన్సిల్ సభ్యులు అందరూ సుముఖంగా ఆమోదించారు.